Reading Time: < 1 minute
Rahul Gandhi Says My Goal Is 100 Firs As Opposition Heads To Jantar Mantar

SIR Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ, సహా విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సిద్ధమయ్యారు. దీనికి ముందు విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు.

ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజస్వామ్యాన్ని సీఈసీ ధ్వంసం చేస్తు్న్నారని ఆరోపించారు. లంచ్ మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత రోజు సుమారు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవాలని కోరుకున్నారని, అయితే నిరసనలకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. అందుకే బుధవవారం జంతర్ మంతర్‌కు వెళ్లి నిరసన తెలియజేస్తామని చెప్పారు.

జ్ఞానేష్ కుమార్ దేశానికి చట్టబద్ధమైన ఎన్నికల కమిషనర్ కాదనేది తమ అభిప్రాయమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జ్ఞానేష్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. తనపై నమోదవుతున్న ఎఫ్ఐఆర్లను మెడల్స్‌గా స్వీకరిస్తానని, ఇప్పటి వరకు 45 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, 100 ఎఫ్ఐఆర్లు తమ లక్ష్యమని అన్నారు.