Reading Time: < 1 minute

ఆప్టోజెనెటిక్స్‌‎లో సంచలనాత్మక ఆవిష్కరణలు.. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Caption of Image.

వైద్య శాస్త్రవేత్తలు కార్ల్ డైసెరోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్ 2026 సంవత్సరానికి గానూ వైద్య రంగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఆప్టోజెనెటిక్స్‌ (న్యూరో సైన్స్) ఆవిష్కరణలకు సంబంధించి చేసిన విశేష కృషికి గానూ వీరిని ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డ్ వరించింది. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్ అసెంబ్లీ సోమవారం (అక్టోబర్ 5) ఈ ప్రకటన చేసింది. స్వీడిష్ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

ఆప్టోజెనెటిక్స్ అనేది కాంతి సహాయంతో మెదడులోని నాడీ కణాలను, జన్యువులను నియంత్రించే లేటేస్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా సజీవంగా ఉన్న మెదడులో నాడీ కణాలు మన జ్ఞాపకాలను, భావోద్వేగాలను, ప్రవర్తనలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. 

న్యూరోసైన్స్ రంగంలో ఈ ఆవిష్కరణ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. మానసిక, నాడీ సంబంధిత వ్యాధులకు కారణమయ్యే సర్క్యూట్లను గుర్తించడానికి పరిశోధకులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఈ విధానాన్ని ఉపయోగించి దృష్టి లోపం ఉన్నవారికి తిరిగి చూపును ప్రసాదించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. 

 

©️ VIL Media Pvt Ltd.