Reading Time: < 1 minute
Dmk Questions Rahul Gandhi Over Sir Deletions In Tamil Nadu Amid Delhi Protest

SIR Row: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, కాక్రోచ్ జనతాపార్టీ(CJP) వంటి సంస్థలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిలిపేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు మంగళవారం ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ మాజీ మిత్రపక్షం డీఎంకే రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించింది. ‘‘తమిళనాడులో SIR ప్రక్రియ ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటి?’’ అని డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘‘ SIR తర్వాత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేయాలన్న ఖర్గే వ్యాఖ్యలను ఆయన ఎందుకు సమర్థించడం లేదు? తమిళనాడులో SIR గురించి మాట్లాడటానికి ఆయన సీఎం విజయ్‌ని చూసి భయపడుతున్నారా? ద్వంద్వ ప్రమాణాలు కలిగిన వ్యక్తి రాహుల్ గాంధీ’’ అని పోస్ట్ చేశారు.

ఏప్రిల్‌లో తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ కొన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో డీఎంకే స్నేహాన్ని వదులుకుని టీవీకే పంచన చేరింది. అప్పటి నుంచి డీఎంకే కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమికి డీఎంకే దూరంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీలో స్నేహమనేదే లేదని తేల్చి చెప్పింది.