Reading Time: 2 minutes

బెంగళూరులో ‘చెప్పుల నిరసన’: అక్టోబర్ 8న ఫ్రీడమ్ పార్క్ నిరసనలో చేరాలని ప్రకాష్ రాజ్ పిలుపు!

Caption of Image.

ఓటర్ల లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, చాలామంది కన్నడిగుల పేర్లను అన్యాయంగా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపిస్తూ అక్టోబర్ 8, గురువారం ఉదయం 10:30 గంటలకు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఒక భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో ‘ప్రజా ట్రిబ్యునల్’ నిర్వహించడంతో పాటు వినూత్నంగా ‘చెప్పుల నిరసన’ చేపట్టనున్నట్లు సీజేపీ (CJP) సహ కన్వీనర్ అశుతోష్ రాంకా ప్రకటించారు.

 నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు:

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఆందోళనకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. “మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. అక్టోబర్ 8న ఫ్రీడమ్ పార్క్ వద్ద మాతో చేరండి” అని సోషల్ మీడియా (X)లో పిలుపునిచ్చారు.

ఎవరెవరు హాజరవుతున్నారు?:

సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాతో పాటు ఇతర పౌర సమాజ సమూహాలు, యువజన సంఘాలు,  రాష్ట్రవ్యాప్తంగా SIR వల్ల నష్టపోయిన బాధితులు/ఓటర్లు ఈ ట్రిబ్యునల్‌కు హాజరుకానున్నారు.

‘చెప్పుల నిరసన’ ఎందుకు?:
ఓటర్ల లిస్ట్ నుంచి పేర్ల తొలగింపు వల్ల తీవ్రంగా ప్రభావితమైన మహిళలకు సంఘీభావంగా ఈ ‘చెప్పుల నిరసన’ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

SIR ప్రక్రియ పేరుతో తొలగించిన ఓట్లన్నింటినీ వెంటనే రద్దు చేసి, సవరణకు ముందు ఉన్న పాత ఓటర్ల లిస్ట్ కొనసాగించాలి.., ఎన్నికల వ్యవస్థలో, ఓటర్ల లిస్ట్ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చీఫ్ ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.