
హైదరాబాద్ బాలాపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బాలాపూర్ నబీల్ కాలనీలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కెమికల్ డ్రమ్ములు పేలాయి. ఈ క్రమంలో భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.
గోదాంలో పాత కెమికల్ డ్రమ్ములు ఉన్నట్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు భారీగా ఎగసిపడుతున్న క్రమంలో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.