
- సీపీఎం నేత బృందాకారత్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్ భగత్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం నేత బృందాకారత్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులకు ఆమె మద్దతు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏసీపీ నేరస్తుడేనని, ఆయనపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టిన బృందాకారత్.. నేరం జరిగినట్లు స్పష్టంగా తెలిసినప్పుడు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. బాధిత జర్నలిస్టుకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.