Reading Time: < 1 minute

బుధవారం తగ్గిన గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో గ్రాము ఎంత ఉందంటే?

Caption of Image.

ఆర్థిక వ్యవస్థలో వస్తున్న కీలక మార్పులతో బులియన్ మార్కెట్ల దిశ మారుతోంది. ద్రవ్యోల్బణ భయాలతో పెరిగిన గోల్డ్, వడ్డీ రేట్ల పెంపుతో అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. గడచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి రేట్లు దాదాపుగా స్థిరంగా కొనసాగుతూ తమ గమనాన్ని ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ ధరల్లో వచ్చిన మార్పులను గమనించటం చాలా ముఖ్యం.

అక్టోబర్ 7న బంగారం రేట్లు తగ్గాయి. అక్టోబర్ 6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.65 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 957గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 710గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 7, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 45వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.