Reading Time: < 1 minute

ఉపాధి పేరిట ఏజెంట్ మోసం.. రష్యా ఆర్మీలో చిక్కుకున్న సిరిసిల్ల యువకుడు

Caption of Image.

రాజన్న సిరిసిల్ల: ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువకుడు అక్కడ చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన దొమ్మాటి కిషన్ ఉపాధి కోసం రష్యా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే రష్యాలో తనను బలవంతంగా ఆర్మీలో చేర్పించారని, అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి పంపించినట్లు కిషన్ తన భార్య రక్షితకు ఫోన్‌లో తెలిపినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఉపాధి కోసం రష్యాకు పంపిస్తానని చెప్పి మోసం చేసిన సిరిసిల్లకు చెందిన ఏజెంట్ దార్నం శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని కిషన్ భార్య రక్షిత కోరుతున్నారు. తన భర్తను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై రక్షిత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆదిత్య మ్యాన్ పవర్ ఏజెంట్ దార్నం శ్రీనివాస్‌పై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కిషన్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.