Reading Time: 2 minutes

ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించేదే లే.. రెపో రేటు పెంపుపై సంజీవ్ మల్హోత్రా క్లారిటీ

Caption of Image.

సమీప కాలంలో వడ్డీ రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రానున్న మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు లేదా తాత్కాలిక పాజ్ ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. 

దేశంలో పెరుగుతున్న ధరల ఒత్తిళ్లు, క్రూడ్ ధరల పెరుగుదల నేపథ్యంలో MPC రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. అలాగే గతంలో ఉన్న న్యూట్రల్ విధానాన్ని మార్చుకుని, కాలిబ్రేటెడ్ టైటనింగ్ వైపు మొగ్గుచూపింది రిజర్వు బ్యాంక్. ఈ నిర్ణయానికి కమిటీలోని ఆరుగురు సభ్యులలో నలుగురు మద్దతు తెలపగా, ఇద్దరు వ్యతిరేకించారు.

ద్రవ్యోల్బణ అంచనాలు గత ఏడాది అంత అనుకూలంగా లేవని మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతంగా నమోదైందని, ఇది RBI నిర్దేశిత 4 శాతం లక్ష్యానికి మించి వరుసగా 3వ నెల కూడా కొనసాగుతోందని తెలిపారు. FY27లో కోర్ ఇన్‌ఫ్లేషన్ 4.4 శాతంగా ఉంటుందని, రానున్న మూడు త్రైమాసికాల్లో సగటు CPI ద్రవ్యోల్బణం 5.8 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు.

దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొంటూ RBI తన FY27 వాస్తవిక GDP వృద్ధి అంచనాను 6.7 శాతం నుండి 7.1 శాతానికి పెంచింది. ప్రైవేట్ వినియోగం, తయారీ రంగం జోరు, బలమైన దేశీయ ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నాయని గవర్నర్ తెలిపారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల సవాళ్లుగా మారాయని హెచ్చరించారు.

ఫిబ్రవరి 2023 తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలిసారిగా రెపో రేటును అక్టోబర్ 10, 2026న పెంచేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ(SDF) రేటును 5.25 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(MSF), బ్యాంక్ రేటును 5.75 శాతానికి సవరించారు. ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ సరళిని బట్టే భవిష్యత్ విధానాలు ఉంటాయని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే నిపుణులు మాత్రం మరో రెండేళ్ల పాటు వడ్డీ రేట్లు అధికంగానే కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే వడ్డీ రేట్ల పెంపులు 2028 చివరిలో ఉండొచ్చనేది వారి వాదన. 

©️ VIL Media Pvt Ltd.