Reading Time: 2 minutes

మన పూర్వీకులు నరకం నుంచి స్వర్గానికి వచ్చే పూజలు కూడా ఉంటాయా..?

Caption of Image.

ఇబ్బందులు ఉన్నాయి. వాటి నివారణ కోసం పూజలు జపాలు చేయించుకుంటాం. దానాలు చేస్తాం. అదే పితృదేవతలు ఇబ్బందులు తొలగాలంటే ఏం చేయాలి.  వారసులు ఎలాంటి పూజలు నిర్వహించాలి.  అసలు అలాంటి పూజలు ఉంటాయా.. గరుడపురాణంలో ఏముంది.. పండితులు ఏం చెబుతున్నారు.  ఏరోజు పితృ దేవతల ఆత్మశాంతి కలుగుతుంది.  నరకంలో బాధలు.. చిత్రహింసలు అనుభవిస్తున్న పూర్వీకులు  మహాలయ పక్షంలో భూమిపైకి వచ్చి తిరిగి స్వర్గానికి వెళ్లాలంటే. వారసులు ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకుందాం. . .!

మహాలయ పక్షాలు పితృదేవతలకు చాలా ముఖ్యమైన రోజులు.  వారి వారసుల ఇళ్లకు మధ్యాహ్న సమయంలో  వచ్చి ఇంటి తలుపు దగ్గర ఉంటారు.  వారు భక్తితో ఇచ్చే ఆహారం, నీరు( తడిబియ్యం, నీరు, నువ్వులను తర్పణాల రూపంలో) తీసుకొని ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు.  అయితే ఈ మహాలయపక్షాల్లో ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. అంతే కాకుండా భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఒకవేళ నరకంనుంచి  వచ్చి తిరిగి స్వర్గానికి వెళతారని పండితులు చెబుతున్నారు.  పురాణాల ప్రకారం అక్టోబర్​ 6 న పితృదేవతల ఆత్మకు శాంతి కలిగి ఆశీర్వదిస్తారని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది.

బాధ్రపదమాసం కృష్ణ పక్షం మహాలయ పక్షాల్లో వచ్చే ఏకాదశి( 2026, అక్టోబర్ 6) ని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ సమయంలో పితృ పక్షాలను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని పితృ పక్షాలలో జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులభమవుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున( 2026, అక్టోబర్ 6)  పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభించి.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెబుతారు..

ఇందిరా ఏకాదశి ఎప్పుడు?

2026లో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని అక్టోబర్ 6న ఆచరిస్తారు. ఏకాదశి తిథి అక్టోబర్ 6న తెల్లవారుజామున 2:07 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 7న అర్ధరాత్రి 12:34 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజున భక్తులు శ్రీమహావిష్ణువుతో పాటు ఆయనకు అత్యంత ప్రీతికరమైన శాలిగ్రామాన్ని పూజించడం, ఉపవాసం ఉండటం, విష్ణు నామస్మరణ చేయడం వంటి ఆచారాలను పాటిస్తారు.

ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత..

ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజున ( 2026, అక్టోబర్ 6)పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి.

  •  ఈ ఏకాదశి తిథి( 2026, అక్టోబర్ 6) నాడు పూర్వీకుల విముక్తిని కోరుకుంటూ దేవతల ముందు దీపం వెలిగించి, భగవద్గీతను చదవడం లేదా వినడం చేయాలి.
  •  భగవద్గీత మొత్తం చదవడం సాధ్యం కాకపోతే, కనీసం ఏడో అధ్యాయమైనా చదవాలి లేదా వినాలి.
  •  పూర్వీకుల విముక్తి కోరుకుంటూ దేవుడిని ఆరాధించాలి.
  • మధ్యాహ్న సమయంలో పితృదేవతల పేర్లు చెపుతూ నువ్వులు, నీరు కుడి చేతి బొటనవేలి ద్వారా తర్పణాలు వదలాలి.  అలాగే నాలుగు వేళ్ల మీదుగా తడిబియ్యం, నీళ్లు తర్పణాలు వదలాలి
  • ఇలా ఒక్కొక్కరి పేరు మూడు సార్లు చెబుతూ తర్పణాలు వదలాలి.
  •   సాయంత్రం వేళ తులసి చెట్టు ముందు నేతి దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూర్వీకుల విముక్తి కోసం ప్రార్థించాలి.
  •   ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు ఎదుట ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడంతో పాటు మనకు ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇందిరా ఏకాదశి రోజు ఇలా చేయడం వలన పూర్వీకులు యమలోకం నుండి విముక్తి పొందుతారు. శ్రాద్ధ పక్షం/పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి పుణ్యాన్ని పూర్వీకులకు సమర్పిస్తే నరకానికి వెళ్లిన పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.