
విదేశాల్లో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెడతాయో నిరూపించే ఒక అద్భుతమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న కిప్ క్రాసింగ్ అనే అమెరికన్ పౌరుడు తన భారతీయ భార్య మర్యాదపూర్వక ప్రవర్తనను చూసి గర్వపడుతూ షేర్ చేసిన వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇటీవల ఈ దంపతులు థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌లో బస చేసి, రూమ్ ఖాళీ (చెక్‌అవుట్) చేసే సమయంలో కిప్ ఈ వీడియోను చిత్రీకరించారు. వారు గదిని వదిలి వెళ్లేముందు ఆయన భార్య ఆ రూమ్‌ను వారు ప్రవేశించినప్పుడు ఎంత శుభ్రంగా ఉందో, మళ్లీ అలాగే సర్ది ఉంచడం విశేషం. బెడ్‌ను నీట్‌గా సర్ది, టవళ్లను చక్కగా మడిచి, వంటగదిలోని పాత్రలన్నింటినీ కడిగి అమర్చారు. చెత్తను వేర్వేరు బ్యాగుల్లో వేసి, బాత్రూమ్‌ను కూడా శుభ్రపరిచారు. అన్నింటికంటే ముఖ్యంగా, రూమ్ హౌస్‌కీపింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రవేశ ద్వారం వద్ద కొన్ని పూలు, ‘ధన్యవాదాలు’ అని రాసిన ఒక చిన్న నోట్‌ను ఉంచడం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. తన భార్య భారతదేశంలోని మిజోరం రాష్ట్రానికి చెందినవారని, అక్కడి ప్రజలు ఎంతో పద్ధతిగా, సున్నిత మనస్తత్వంతో ఉంటారని కిప్ కొనియాడారు. కొంతమంది పర్యాటకుల ప్రవర్తన వల్ల భారతీయులందరిపై అపోహలు ఏర్పడుతున్నాయని, అయితే కొందరిని చూసి మొత్తం దేశాన్ని అంచనా వేయకూడదని, భారతదేశం ఎంతో వైవిధ్యభరితమైనదని ఆయన సందేశమిచ్చారు. హోటల్ సిబ్బంది శ్రమను గుర్తించి, వారికి ఇచ్చే ఈ చిన్న గౌరవమే అసలైన సంస్కారమని నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే 24 రోజులు ఉచిత కాల్స్
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో బెడిసికొట్టిన పులి ప్లాన్