Reading Time: < 1 minute

ఫైనాన్స్ వేధింపులు.. యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.. మెదక్ జిల్లాలో ఘటన

Caption of Image.

శివ్వంపేట/ పాల్వంచ, వెలుగు: మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం పాంబండకు చెందిన నాగళ్ల కుమార్​(23) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఇటీవల అతడు ఓ ప్రైవేట్​ ఫైనాన్స్​ సంస్థ నుంచి బైక్​ కొనుగోలు చేశాడు. వెహికల్​కు సంబంధించిన రూ.15 వేలు కిస్తీ బకాయి ఉండడంతో సోమవారం ఫైనాన్స్​ సంస్థ వారు బైక్​ను తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన కుమార్​ మంగళవారం పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

తల్లిదండ్రులు ఘర్షణ పడుతున్నారని..తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతున్నారని యువకుడు సూసైడ్​ చేసుకున్న ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన భూక్య మోతీలాల్, కౌసల్య దంపతులకు చెందిన కొడుకు కార్తీక్ (18) ఐటీఐ చదువుతున్నాడు. తరచూ తల్లిదండ్రులు ఘర్షణ పడుతున్నారని ఊరిలో తనకు చెడ్డ పేరు వస్తుందంటూ కార్తీక్ సోమవారం వారితో వాదనకు దిగాడు.

 దీంతో మోతీలాల్​ మణుగూరులోని కూతురు వద్దకు వెళ్లాడు. మంగళవారం ఉదయం నిద్రలేచిన తల్లి కొడుకు కనిపించకపోవడంతో ఇంట్లో వెతుకగా ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

©️ VIL Media Pvt Ltd.