Reading Time: 2 minutes
Epic Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆనంద్, వైష్ణవి చైతన్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

‘బేబీ’ వంటి మైండ్ బ్లోయింగ్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic – First Semester). సిరివెన్నెల ఎంటర్‌టైన్‌మెంట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 9, 2026 నుంచి ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

కథ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఒక కుర్రాడు.. అక్కడ ఎదుర్కొన్న అనుభవాలు, లవ్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్, ఫస్ట్ సెమిస్టర్ లైఫ్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో పాటు సీనియర్ నటుడు శివాజీ, వాసుకి, కళ్యాణ్ శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

మొదటి భాగంలో వచ్చే విలేజ్ , అబ్రాడ్ కామెడీ సీన్లు, ఆనంద్-వైష్ణవిల మధ్య కెమిస్ట్రీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం (ముఖ్యంగా “సంచారమే” పాట) , తండ్రి-కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

ఎపిక్ ఓటీటీ డేట్..

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..