Reading Time: 2 minutes

Sivakarthikeyan: ‘నేను పీపుల్స్ మేడ్ స్టార్’ ని.. రాజకీయాల్లోకి శివకార్తికేయన్!

Caption of Image.

తమిళనాట రాజకీయాలకు , సినిమాలకు వీడదీయరాని అనుబంధం ఉంది. నాటి ఎంజీఆర్ నుంచి నేటి సీఎం విజయ్ వరకు అందరూ సినిమా  బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే. అంతేకాదు ఇటీవల పలువురు సినీ హీరోలు సైతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అంటున్నారు. హీరోలు ధనుష్ అభిమానలతో సమావైశమై.. ప్రజాసేవలో భాగం కావాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు నటుడు, దర్శకుడు, కొరియో గ్రాఫర్ రాఘవ్ లారెన్స్ సైతం తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అంటూ ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఇదే బాటలో మరో కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ చేరారు. లేటెస్ట్ గా చెన్నై పోరూర్‌లో శివకార్తికేయన్ అభిమానులతో సమావేశమైయ్యారు. ఈ భేటీకి సుమారు 3వేల మంది వరకు ఫ్యాన్స్ హాజరైయ్యారు. అయితే ఈ సమావేశంలో శివకార్తికేయన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.

నన్ను అందరూ సెల్ఫ్ మేడ్ స్టార్ అంటారు. కానీ అది తప్పు .. నన్ను సూపర్ స్టార్ ను చేసింది ప్రజలే. అందుకే ‘నేను పీపుల్స్ మేడ్ స్టార్ ‘ని అని అన్నారు. విమర్శకులు ఏమన్నా పట్టించుకోద్దు. ఎంత ఎదిగినా విమర్శలు ఆగవు. వాటి దాటుకుని ముందుకు సాగడమే అసలైన గెలుపని ఫ్యాన్స్ కు  పిలుపునిచ్చారు శివకార్తికేయన్.

సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేయకండి. ప్రతిరోజూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం, కుటుంబాన్ని బాగా చూసుకోవడమే నా నిజమైన అభిమానుల లక్షణం అంటూ ఫ్యాన్స్ కు  హితవు పలికారు శివకార్తికేయన్ . ప్రస్తుతం ఈ హీరో  మాటలు నెట్టింట వైరల్ అువున్నాయి.

శివకార్తికేయన్ ప్రస్తుతం శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సేయోన్’ సినిమా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను 2027 పొంగల్కి భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు ‘పార్కింగ్’ ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో ‘SK27’ షూటింగ్ కూడా రీసెంట్‌గా ఘనంగా ప్రారంభమైంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది.  ఒకవైపు సినిమాలతో దూసుకెళ్తున్న  శివకార్తికేయన్.. మరోవైపు రాజకీయ ఎంట్రీపై కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.