Reading Time: < 1 minute

రాహుల్, ప్రియాంక అరెస్ట్.. బలవంతంగా వాహనం ఎక్కించిన పోలీసులు

Caption of Image.

ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, ప్రియాంకా వాద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ఎంపీలు అక్టోబర్ 7న   బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు.

అయితే నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు రాహుల్ ను, విపక్ష ఎంపీలను అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు ,కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం, తోపులాట జరిగింది. తమపై పోలీసులు దాడి చేశారని, నిరసన ప్రదేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ‘ఇండియా (INDIA) కూటమి ఎంపీలు తెలిపారు. దీంతో రాహుల్ ను పోలీసులు  బలవంతంగా వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.  

తమను నిరసన ప్రదేశానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, తమపై దాడి చేశారని INDIA కూటమి ఎంపీలు ఆరోపించారు. మరోవైపు, నిరసనకు అనుమతి తీసుకోలేదని, కేంద్ర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, సమావేశాలపై ఆంక్షలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.