Reading Time: 2 minutes

IPL 2027: CSK నుంచి SRH వరకు.. 10 జట్ల హెడ్ కోచ్‌లు ఎవరో తెలుసా?

Caption of Image.

IPL 2027 Coaches: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) 20th సీజన్‌కు సంబంధించి అన్ని జట్ల హెడ్ కోచ్‌ల వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు కొత్త హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) నియమితులయ్యారు. హేమంత్ బదానీ స్థానంలో గంగూలీ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా తన లాంగ్-టర్మ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ని వదిలి పెట్టిన తర్వాత, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) ను నూతన హెడ్ కోచ్‌గా ప్రకటించింది. ఈ నియామకాలతో IPL 2027 సీజన్ కోసం 10 ఫ్రాంచైజీల కోచింగ్ సెటప్ పూర్తిగా కొలిక్కి వచ్చింది. ఇకపై ఫ్రాంచైజీల దృష్టి మొత్తం ఆటగాళ్ల రిటెన్షన్స్, వేలం (Auction) వ్యూహాలపైనే పెట్టనుంది. 

నెక్ట్స్ టార్గెట్ ఐపీఎల్ 2027 వేలం: 

అన్ని ఫ్రాంచైజీలు తమ హెడ్ కోచ్‌ల ఎంపికను పూర్తి చేసుకోవడంతో, ఇకపై పూర్తి దృష్టిని స్క్వాడ్ ప్లానింగ్‌పై పెట్టనున్నాయి. ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకోవాలి (Retentions), ఎవరిని వదిలేయాలి (Releases) అనే విషయాలపై జట్లు కసరత్తు చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి పెద్ద జట్లలో జరిగిన కోచింగ్ మార్పులు రాబోయే సీజన్‌పై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. 

నలుగురు భారతీయులు, ఆరుగురు విదేశీ కోచ్‌లు: 

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027)  సీజన్‌కు సంబంధించి 10 జట్లలో నలుగురు భారతీయ హెడ్ కోచ్‌లు ఉండగా, మిగతా ఆరు జట్లు విదేశీ కోచ్‌ల చేతుల్లోనే ఉన్నాయి.

IPL 2027 హెడ్ కోచ్‌ల జాబితా: 

* చెన్నై సూపర్ కింగ్స్ (CSK): జహీర్ ఖాన్ (Zaheer Khan)

* ఢిల్లీ క్యాపిటల్స్ (DC): సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)

* గుజరాత్ టైటాన్స్ (GT): ఆశిష్ నెహ్రా (Ashish Nehra)

* కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): అభిషేక్ నాయర్ (Abhishek Nayar)

* లక్నో సూపర్ జెయింట్స్ (LSG): జస్టిన్ లాంగర్ (Justin Langer)

* ముంబై ఇండియన్స్ (MI): మహేల జయవర్ధనే (Mahela Jayawardene)

* పంజాబ్ కింగ్స్ (PBKS): రిక్కీ పాంటింగ్ (Ricky Ponting)

* రాజస్థాన్ రాయల్స్ (RR): కుమార సంగక్కర (Kumar Sangakkara)

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఆండీ ఫ్లవర్ (Andy Flower)

* సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): డానియల్ వెట్టోరి (Daniel Vettori)

©️ VIL Media Pvt Ltd.