Reading Time: < 1 minute
Andhra Pradesh: అద్భుత శక్తులు వస్తాయని.. చంపి శరీర భాగాలను తీసుకెళ్తాడు.. ఆ తర్వాత..

శరీర భాగాలతో క్షుద్ర పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని నమ్మాడు. దీంతో హత్యలు చేయడం వారి శరీర భాగాలు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. రెండు హత్యలు చేసిన తర్వాత పోలీసులకు చిక్కాడు. ఆదమరిచి నిద్ర పోతున్న వారిని చంపి వారి శరీర భాగాలు తీసుకెళ్లిన నిందితుడిని పల్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగుచూడటతో జిల్లా వ్యాప్తంగా నిందితుడి అరెస్ట్ కలకలం రేపింది. నర్సరావుపేట బరంపేటలో నివసించే నిఖిల్ జులాయిగా తిరగుతుంటాడు.. మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని నమ్ముతుంటాడు. గత నెల 29న బ్రహ్మానంద రెడ్డి కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్ లో నిద్ర పోతున్న గాసి రాజేష్ దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో మోది రాజేష్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిఖిల్ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాడు. వారం రోజుల క్రితం చేసిన హత్యతో పాటు 2018లో జరిగిన మరొక హత్య బయట పడింది. రాజేష్ ను హత్య చేసిన తర్వాత అతని గుండెపై ఉన్న చర్మంతో పాటు మర్మాంగాలపై ఉన్న వెంట్రుకలను తీసుకెళ్లాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి సిసి కెమెరాలను జల్లెడ పట్టడంతో నిఖిల్ కదలికలను గుర్తించారు. 2018లోనూ నాగరాజు అనే వ్యక్తిని హత్య చేసిన నిఖిల్ అతని వేలును తీసుకెళ్లాడు. రెండు కేసుల్లోనూ శరీర భాగాలు మాయ మవ్వడంపై పోలీసులు అనుమానాలు మరింత బలపడ్డాయి. నిఖిల్ ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగు చూశాయి.

వీడియో చూడండి..

అయితే నిఖిల్ మానసిక స్థితి సరిగా లేదన్న విషయం బయటపడింది. సాంకేతిక ఆధారాలు సేకరించి నిఖిల్ ను అరెస్ట్ చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అడహళ్లి అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.