
Indus Waters Treaty: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో సమావేశమయ్యారు. బుధవారం రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాయలంలో ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఇందులో ప్రాంతీయ భద్రత, జమ్మూ కాశ్మీర్, భారత్‌తో నిలిపేసిన సింధు జలాల ఒప్పందం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది. ప్రపంచ శాంతి, మానవతా సహాయాన్ని ప్రోత్సహిస్తున్న గుటెర్రస్ నాయకత్వంపై పాకిస్తాన్ ప్రశంసలు కురిపించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. సింధు జలాల విషయం ఐరాస చీఫ్‌తో ప్రస్తావనకు వచ్చినట్లు పాకిస్తాన్ సైన్యం తెలిపింది. గుటెర్రస్ మూడు రోజుల పర్యనటలో భాగంగా మంగళవారం పాకిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ సేవ, నాయకత్వం, ప్రపంచ శాంతికి చేసిన కృషికి గానూ జర్దారీ గుటెర్రస్‌కు పాకిస్తాన్ అత్యున్నత పౌరపురస్కారాల్లో ఒకటైన ‘‘నిషాన్-ఏ-ఇంతియాజ్’’ ప్రధానం చేసింది.