Reading Time: < 1 minute
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో మంగళవారం (అక్టోబర్ 06) ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో పలువురు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ నేతలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ తదితరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడే ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీ పోలీసు బ్యారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండాను ప్రదర్శించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఆయనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఆకాశవాణి భవన్ వద్దే నిరసన కొనసాగించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ నిరసన చేపట్టినట్లు ప్రతిపక్ష కూటమి నేతలు తెలిపారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిసేందుకు అనుమతించాలని, ఆయన రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం తమకు ఏ రాజకీయ పార్టీ నుంచి అధికారికంగా సమావేశం కోరుతూ అభ్యర్థన అందలేదని తెలిపింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.