
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వైట్-బాల్ (వన్డే, టీ20) క్రికెట్‌కు సంబంధించి భారత జట్టు పూర్తిస్థాయి (Full-time) కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నియమితులయ్యారు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా సేవనందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈరోజు (అక్టోబర్ 6,2026, మంగళవారం) ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించింది.
మంచి లీడర్‌షిప్ అనుభవం:
అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి మంధనకు నాయకత్వ అనుభవం కూడా ఎక్కువే. ఆమె ఇప్పటికే భారత్ తరఫున 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 4 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును 2024, 2026 సంవత్సరాల్లో టైటిల్ విజేతగా నిలపడంలో ఆమె లీడర్‌షిప్ కీలక పాత్ర పోషించింది. ఈ విజయాలే ఆమెను పూర్తిస్థాయి కెప్టెన్ రేసులో ముందుంచాయి.
దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవం: స్మృతి మంధాన
భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితులు కావడంపై స్మృతి మంధాన మాట్లాడుతూ.. దేశానికి నాయకత్వం వహించడం తనకు దక్కిన అత్యున్నత గౌరవంగా అభివర్ణించింది. తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, సెలెక్టర్లు, సహచర ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందించిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో జట్టును విజయపథంలో నడిపించేందుకు అందరితో కలిసి సమిష్టిగా కృషి చేస్తానని మంధాన స్పష్టం చేసింది.
స్మృతి ఎంపికని స్వాగతించిన బీసీసీఐ పెద్దలు:
స్మృతి మంధనకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ పెద్దలు మాట్లాడుతూ.. ఆటపై ఆమెకు ఉన్న అవగాహన, అనుభవం, నిబద్ధత జట్టుకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీని విజయవంతంగా నడిపించిన అనుభవం, ఒత్తిడిని తట్టుకునే తత్వం ఆమెకు మెండుగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో భారత మహిళా జట్టు ఆమె సారథ్యంలో అద్భుతాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
A dawn of a new era ✨ Smriti Mandhana takes charge as the Captain of the Indian Women’s cricket team 🇮🇳 Go well, Captain 🫡 More details ▶️ https://t.co/tbLb4jOiCn #TeamIndia | @mandhana_smriti https://t.co/27AxmrUhKt
— BCCI (@BCCI) October 6, 2026