Reading Time: < 1 minute
గోల్డ్ మెడల్ విన్నర్ జ్యోతి సురేఖను కలిసిన లోకేష్.. 2028 ఒలింపిక్స్‌పై కీలక హామీ..!

Asian Games 2026: ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణ పతకంతో మెరిసిన ప్రముఖ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ (Vennam Jyothi Surekha) సోమవారం మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. జపాన్‌లో జరిగిన ఈ క్రీడల్లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. తండ్రి సురేంద్రకుమార్‌తో కలిసి ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వెళ్లారు.

జ్యోతి సురేఖ సాధించిన విజయాన్ని మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలు సహా మొత్తం ఆరు పతకాలు సాధించిన ఘనత సురేఖకు ఉంది.

Gold Winner Jyothi Surekha Meets With Minister Nara Lokesh

ఈ భేటీలో 2028 ఒలింపిక్స్‌ లక్ష్యం కూడా ప్రస్తావనకు వచ్చింది. తదుపరి ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని లోకేష్ సూచించారు. ఆ లక్ష్యానికి అవసరమైన సహకారం అన్నివిధాలా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..