Reading Time: < 1 minute
Megastars Vishwambhara Release Date Locked Vassishtas Fantasy Wonder Set For The Shivaratri Race

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష కథానాయికగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనులు కారణంగా విడుదల నిరంతరం ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక దశలో ఈ సినిమా ఇక రాదని కూడా రూమర్స్ వినిపించాయి.  తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ రేసులో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని కూడా వినిపించింది. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో మరొక క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని 2027 మార్చిలో మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాంటసీ మరియు డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశం కావడంతో, శివరాత్రి సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద సినిమాకి మరింత ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ తన కొత్త చిత్రం కాకాతో పలకరించనుండగా, ఆ సినిమా సందడి ముగిసిన తర్వాతే ‘విశ్వాంబర’ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు. మరి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫ్యాంటసీ వండర్ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.