Reading Time: < 1 minute
Hyderabad: సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీస్‌‌స్టేషన్ పరిధిలోని డీఎల్‌ఎఫ్ గేట్-2 ఎదురుగా ఉన్న ‘ఆర్వీ ఎలైట్ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన మండేలా మనిషా అనే యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ గదిలో విగతజీవిగా పడిఉన్న మనిషాను గుర్తించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

అయితే సంఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో తండ్రిని ఉద్దేశించి ఆమె రాసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. హాయ్ డాడీ.. ఐ యామ్ సారీ, మిస్ యూ అంటూ లేఖలో పేర్కొంది. తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకే తాను ఉద్యోగం చేస్తున్నానని, కానీ ఆ అప్పులు తీర్చడం తన వల్ల సాధ్యం కావడం లేదని.. ఈ క్రమంలో తీవ్ర ఒంటరితనానికి లోనయ్యానని, జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నానని.. ఆమె నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ నోట్ ఆమె రాసిందేనా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో మనీష ఆత్మహత్యకు గత పూర్తి కారణాలు తెలుసుకునేందుకు, ఆమె మొబైల్ ఫోన్‌లోని కాల్ డేటా, వాట్సాప్ చాట్స్, ఆర్థిక లావాదేవీలతో పాటు హాస్టల్‌‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే మనీష మృతిపై ఇప్పటివరకు బంధువులు ఎవరూ పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు ఇవ్వలేదు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేయనున్నట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.