
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సంబంధించిన ఓ బీచ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈసారి నయనతార ఒరిజినల్ ఫొటో కంటే.. నెటిజన్లు ఎడిట్ చేసిన వెర్షన్లు మరింతగా వైరల్ అవుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో నయనతార కనిపించిన ఈ ఫొటోకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుండగా.. కొందరు నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. ముఖ్యంగా 41 ఏళ్ల వయసులోనూ నయన్ మెయింటైన్ చేస్తున్న అద్భుతమైన ఫిట్‌నెస్, స్ట్రక్చర్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
బీచ్ ఫొటోలతో నయనతార సందడి..
తాజా ఫొటోల్లో నయనతార (Nayanthara) బీచ్ ఒడ్డున వైట్ క్రాప్ టాప్, షీర్ ర్యాప్ స్కర్ట్‌తో కనిపించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలకు సాఫ్ట్ ఫోకస్, మోషన్ బ్లర్ ఎఫెక్ట్‌ను జోడించడంతో మరింత డ్రీమీగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. నయనతార లుక్, ఫొటోల ప్రజెంటేషన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
🔥 https://t.co/w72CQeCmCO
— Nayanthara✨ (@NayantharaU) October 5, 2026
బ్లర్ ఫొటోతో.. నెటిజన్ల ఎడిట్స్‌కు ఫుల్ క్రేజ్!
నయనతార షేర్ చేసిన ఫొటోల్లో మోషన్ బ్లర్, డబుల్ ఎక్స్‌పోజర్ తరహా ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో ఫొటోలోని కొన్ని భాగాలు స్పష్టంగా కనిపించకుండా డ్రీమీ లుక్‌లో ఉన్నాయి. ఈ స్టైల్‌ను గమనించిన నెటిజన్లు.. ఫొటోను వివిధ రకాలుగా AIతో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు బ్లర్ ఎఫెక్ట్‌ను తొలగించే ప్రయత్నం చేయగా.. మరికొందరు తమకు నచ్చిన విధంగా ఫొటోకు కొత్త లుక్ ఇచ్చారు.
Nayanthara peak 🔥🔥🔥🔥🔥 https://t.co/IPF4z5evXN
— Actresses Rasigan (@MHN66426) October 5, 2026
ఒరిజినల్ కంటే ఎడిటెడ్ ఫొటోలే వైరల్..
సోషల్ మీడియాలో ప్రస్తుతం నయనతారకు సంబంధించిన ఒరిజినల్ ఫొటోలతో పాటు నెటిజన్లు రూపొందించిన ఎడిటెడ్ వెర్షన్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు ఫొటో ఏది? ఎడిట్ చేసినది ఏది? అనే ఆసక్తి కూడా కొందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఫొటోలోని బ్లర్ ఎఫెక్ట్‌ను తొలగించినట్లుగా కనిపించే కొన్ని వెర్షన్లను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
►ALSO READ | EPIC OTT: లవ్, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కథగా ‘Epic’.. ఓటీటీలోకి ఆనంద్, వైష్ణవిల రొమాంటిక్ డ్రామా..
డ్రీమీ బీచ్ ఏస్థటిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
సాధారణ హాలిడే ఫొటోల తరహాలో కాకుండా.. నయనతార తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ప్రత్యేకమైన విజువల్ స్టైల్‌తో రూపొందించారు. మబ్బులతో కూడిన ఆకాశం, సముద్ర తీరం, సాఫ్ట్ లైటింగ్ ఫొటోలకు డ్రీమీ లుక్‌ను తీసుకొచ్చాయి. ఆమె కదలికల కారణంగా ఏర్పడిన షాడో ఎఫెక్ట్‌తో డబుల్ ఎక్స్‌పోజర్ తరహాలో ఫొటోలు కనిపిస్తున్నాయి. ఈ పోస్ట్‌కు సీసీ (cici) పాడిన ‘Orange Flavored Cigarettes’ పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించింది.
వరుస సినిమాలతో బిజీగా నయనతార
ప్రస్తుతం నయనతార పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘మూకుత్తి అమ్మన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ‘డియర్ స్టూడెంట్స్’ కూడా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ‘రక్కయీ’ షూటింగ్ దశలో ఉంది. ‘మన్నాంగట్టి సిన్స్ 1960’ ఇప్పటికే పూర్తయింది. అలాగే హిందీలో తెరకెక్కుతున్న వంశీ పైడిపల్లి – సల్మాన్ ఖాన్ మూవీ (SVC63) సినిమాలోనూ నయనతార నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
💛 🇲🇻 https://t.co/Mnx7zV2W9o
— Nayanthara✨ (@NayantharaU) September 20, 2026