
బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ ప్రస్తుతం నామినేషన్ల వేడితో రగిలిపోతోంది. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది సభ్యులు పోరు సాగిస్తుండగా.. ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ ఈ గండాన్ని ఎదుర్కొంటున్నారు.. అయితే, ఐదో వారం ముగిసేసరికి బిగ్‌బాస్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
ఈ వీకెండ్ ‘డబుల్ ఎలిమినేషన్’ ధమాకాతో పాటు హౌస్‌లోకి ఊహించని ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీల’సునామీ రాబోతోందని సమాచారం. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ రేసులో వినిపిస్తున్న పేర్లు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ 7 ఫైనలిస్ట్, నటి ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి కూడా తప్పుకోవడంతో ఈ ప్రచారం నిజమని తెలుస్తోంది. ఇక గత సీజన్లలో తన ఆవేశంతో వార్తల్లో నిలిచిన కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ సతీమణి ‘నీతు’ కూడా గ్రాండ్ వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
►ALSO READ | యువత ఆలోచనలు కలుషితమవుతున్నాయి.. సమాజానికి ‘హనుమాన్ అంశ్’ వంటి చిత్రాలు అవసరం: మైత్రీ రవిశంకర్
దీంతో పాటు, అగ్నిపరీక్ష షో ద్వారా క్రేజ్ సంపాదించిన శ్రీకాకుళం కుర్రాడు ‘నవరసాలు రామకృష్ణ’ కూడా ఈసారి పక్కా ప్లాన్‌తో వైల్డ్ కార్డ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడట. గతంలో మిథిలేష్ చేతిలో ఓడిపోయిన రామకృష్ణ, ఈసారి రివేంజ్ గేమ్‌తో హౌస్‌ను ఊపేయడానికి రెడీ అవుతున్నాడు. వీరితో పాటు బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్ మాజీ ప్రియురాలు కావ్యశ్రీ, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ ల పేర్లు కూడా రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి.
పాత కంటెస్టెంట్ల భాగస్వాములు, మాజీ ప్రేమికులు ఒకే వేదికపైకి వస్తుండటంతో హౌస్‌లో డ్రామా, గొడవలు పీక్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్లలో ఎవరెవరు అడుగుపెట్టి రచ్చ లేపుతారో చూడాలి.