
- ఆరు బంగారం బిస్కెట్లతో వచ్చి ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్రయాణికుడు
- విలువ రూ.2.25 కోట్ల పైమాటే…
శంషాబాద్, వెలుగు : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. తిరుచ్చి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి అండర్వేర్లో రూ. 2.25 కోట్ల విలువ చేసే ఆరు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
సదరు ప్రయాణికుడు తన లో దుస్తుల కింద ప్రత్యేకంగా డిజైన్ చేసిన పౌచ్‌లో కిలోన్నర బరువున్న 6 బంగారు బిస్కెట్లను బ్లూ కలర్ అడెసివ్ టేప్, కార్బన్ పేపర్‌తో చుట్టి తీసుకువస్తుండగా డీఆర్ఏ అధికారులు పట్టుకున్నారు. వీటి బరువు 1,481.780 గ్రాములు ఉంటుందని అంచనా.