Reading Time: 2 minutes
OTT Movie: ఓటీటీలో మరో మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 7.6 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ వీటిని తెగ చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం రెండు, మూడు మలయాళం సినిమాలు తెలుగులోకి అనువాదమై స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఈ వారం కూడా కూడా 2-3 మలయాళం సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో మలయాళ విలక్షణ నటి ఊర్వశి లీడ్ రోల్‌లో నటించిన మైండ్ బెండింగ్ మలయాళం సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. తెలుగు ఆడియెన్స్ కోసం తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక చిన్న నర్సరీ నడుపుకునే ఆశా (ఊర్వశి) గతంలో జరిగిన ఒక చేదు సంఘటన వల్ల మానసికంగా కుంగిపోయి ఉంటుంది. తన కూతురు (అనఘ) జీవితంగా బతుకుతుంటుంది. అయితే ఒకరోజు ఈ తల్లీ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు జీమన్ అనే వ్యక్తి వాహనాన్ని ఢీకొడుతుంది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ చిన్న యాక్సిడెంట్ గొడవ చివరకు చినికి చినికి గాలి వానగా మారుతుంది. ఈ విషయాన్ని అక్కడితో ముగించేద్దామని ఎంత మంది కోరినా, మొండి పట్టుదలతో ఉన్న ఆశా పోలీస్ కేసుకు వెళ్తుంది. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. చివరకు ఏమైందన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్.

థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించిన ఈ సినిమా పేరు ‘ఆశా’. ఊర్వశితో పాటు తెలుగు వారికి బాగా తెలిసిన జోజు జార్జ్ ఈ మూవీలో మరో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆశా కూతురు అనఘ పాత్రలో ఐశ్వర్య లక్ష్మీ నటించింది. విజయరాఘవన్ మరో కీలక పాత్రలో మెప్పించారు. దర్శకుడు సఫర్ సనాల్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆశా సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. థ్రిల్లర్స్, డార్క్ కాన్సెప్ట్‌ సినిమాలు ఇష్టపడేవారు అక్టోబర్ 16 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమాను చూడవచ్చు.

జీ5 లో మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్..

ఆశా సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.