Reading Time: < 1 minute

ఫ్లైదుబాయ్ ఘటన వెనుక ఇరాన్ హస్తం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Caption of Image.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లైదుబాయ్ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌లోని వైట్‌‌‌‌‌‌‌‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. “ఫ్లైదుబాయ్ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందని నా అభిప్రాయం. ఇది కేవలం నా వ్యక్తిగత నమ్మకం మాత్రమే. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు” అని ట్రంప్ పేర్కొన్నారు. 

మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. ఫ్లైదుబాయ్ ఘటనతో ఇరాన్‌‌‌‌‌‌‌‌కు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదని తేల్చిచెప్పారు. ఈ విషయంపై అమెరికా నిఘా వర్గాలు, సీఐఏ దర్యాప్తు జరుపుతున్నాయని వాన్స్ తెలిపారు. నిఘా సంస్థల నుంచి పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు ఎలాంటి ముందస్తు ప్రకటనలు చేయలేమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలు లోతైన విచారణ జరుపుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో విదేశీ పైలట్లు విమానాలు నడపడంపై వస్తున్న ఆందోళనలపై కూడా వాన్స్ మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు విమానాలు నడపడానికి ఎంతవరకు అర్హులనే దానిపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వాన్స్ అభిప్రాయపడ్డారు. 

అమెరికాపై 2001లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడిని ఉదహరిస్తూ.. సరిహద్దుల్లో లేదా ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో జరిగే చిన్న పొరపాట్లు దేశ భద్రతకే ప్రమాదకరంగా మారుతాయన్నారు.  ఫ్లైదుబాయ్ కో-పైలట్ విషయంలో గతంలోనే కొన్ని అనుమానాలు, హెచ్చరికలు ఉన్నాయని.. అయినప్పటికీ జాగ్రత్తలు పాటించకపోవడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెరికా తన విమానయాన, వీసా నిబంధనలను కఠినతరం చేస్తోందని వాన్స్ పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.