Reading Time: 2 minutes

మహాలయ పక్షాలు:నరఘోష, నరదృష్టి నివారణ.. పితృదేవతల ఆశీస్సులు..అక్టోబర్ 6 న ఇలా చేయండి..

Caption of Image.

మహాలయపక్షాలు కొనసాగుతున్నాయి.  పితృదేవతలు అంటే  ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాల వారు భూమిపై సంచరిస్తారు ( తల్లిదండ్రుల పూర్వీకులు) .  పితృదోషాలు ఉన్నా.. జాతకంలో శని భగవానుడు వక్రదుష్టిలో ఉన్నా.. నరఘోషతో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. విద్యలో.. ఉద్యోగంలో.. కెరీర్​లో.. ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.  అయితే మహాలయ పక్షంలో మంగళవారం ( సెప్టెంబర్​ 6)  ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటిస్తే పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా.. నరఘోష వలన కలిగే ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

మహాలయ పక్షాల సమయంలో పితృదేవతలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.  పురాణాల ప్రకారం బాధ్రపద మాస్ కృష్ణ పక్షంలో పూర్వీకులు భూలోకంలో సంచరిస్తారు.  ఈ ఏడాది ( 2026) అక్టోబర్​ 10 వరకు మహాలయ పక్షాలు ఉంటాయి.  

పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఎంత సంపాదించినా.. ఎంత కష్ట పడినా ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు.  ఇక అలాంటి వారికి నరఘోష వెంటాడటంతో వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  అందుకే మహాలయపక్షాల్లో మంగళవారం రోజు ( అక్టోబర్​6) కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.  ఇలా చేస్తే పితృదేవతలు శాంతించి.. అనుగ్రహం కలగడమే కాకుండా.. నరఘోష నుండి విముక్తి కలుగుతుంది.

మహాలయ పక్షాల్లో  మంగళవారం ( అక్టోబర్​6) ఉదయం స్నానం చేసి ఈ మంత్రాలను పఠించడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోయి, కుటుంబంలో సుఖ సంతోషాలు పెంపొందుతాయి. నరఘోష, నరదృష్టి మరియు శత్రు బాధల నివారణకు హనుమాన్, శని భగవానుడు లేదా నరసింహ స్వామి మంత్రాలను జపించాలి

 శక్తివంతమైన నరదృష్టి / నరఘోష నివారణ మంత్రాలు: 

 హనుమాన్ గాయత్రీ మంత్రం అత్యంత ప్రభావవంతమైనది.. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్,, దీనిని భక్తితో జపించడం వల్ల ప్రమాదాలు, దిష్టి నుండి రక్షణ లభిస్తుంది 

 శని మంత్రం 

“ఓం శం శనిశ్చారాయ నమః ఓం శంనో దేవీరభీష్ట అపో భవన్తుపితయే| 
ఓం శం శనైశ్చరాయ నమః ఓం సూర్య పుత్రాయ నమః” 
శని దోషం మరియు నరఘోష నివారణకు ఈ మంత్రం పఠించాలి

 సాధారణ నరదృష్టి నివారణ మంత్రం

 ఓం హ్రీం క్రీం నమః ఓం ఆం హ్రీం హనుమతే నమః 
 ఇది నరదృష్టి పారిపోవడానికి సహాయపడుతుంది 

 నరదృష్టి నివారణకు హనుమాన్ చాలీసా లేదా నరసింహ కవచం పఠించాలని పండితులు చెబుతున్నారు.

ఇంకా ఏమేమి చేయాలంటే..

  • పితృదేవతలను శాంతింపచేసేందుకు కాకులకు ఆహారం, నీరు ఇవ్వాలి.
  • గోమాతకు పచ్చిమేతను పెట్టాలి.
  • బ్రాహ్మణులకు స్వయంపాకం, దక్షిణ ఇవ్వాలి.
  • పెద్దల పేర్లు చెపుతూ నువ్వులు, తడిబియ్యం.. నీళ్లను వదలాలి.
  • పేదవారికి వస్త్రదానం చేయాలి. 
  • నదీతీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో  పిండప్రదానం, తర్పణాలు చేస్తే చాలా మంచిది
  • పితృదేవతలు ముత్తైదువులయితే.. ముత్తైదు స్త్రీకి  భోజనం పెట్టి బట్టలతో పాటు.. గాజులు, పసుపు, కుంకుమ ఇతర అలంకరణ సామాగ్రి ఇవ్వాలి. 
  • ఇలా చేసినవారు ఒకపూట మాత్రమే భోజనం చేయాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.