Reading Time: < 1 minute
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలో తన చుట్టూ ఉన్న వలయాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శనిగ్రహం, అక్టోబరు 4, ఆదివారం అంటే ఈరోజే భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. దీంతో ఈ రోజు రాత్రంతా ప్రకాశవంతంగా మెరుస్తూ ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. ప్రతి ఏడాది ఒకసారి జరిగే ఈ అరుదైన సన్నివేశాన్ని ‘ప్రతియోగం’ అని పిలుస్తారు. ఈ సమయంలో సూర్యుడు, భూమి, శనిగ్రహం ఒకే సరళరేఖపైకి వస్తాయి. ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమయంలో శనిగ్రహం భూమి నుంచి సుమారు 126.17 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి తూర్పు దిశలో లేత పసుపు రంగుతో ప్రకాశవంతమైన చుక్కలా శనిగ్రహం ఆకాశంలో ఉదయించనుంది. సాధారణంగా ప్రతి 378 రోజులకు ఒకసారి ఇలాంటి ప్రతియోగం ఏర్పడుతుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు, కంటితోనే నేరుగా స్పష్టంగా గుర్తించవచ్చు. అయితే చిన్న టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ సాయంతో చూస్తే శనిగ్రహం చుట్టూ ఉండే రాళ్ళు, మంచు ముక్కల వలయాలు మరింత స్పష్టంగా కనిపించి మంత్రముగ్ధులను చేస్తాయి. 2026 సంవత్సరంలో శనిగ్రహం అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రోజు కూడా ఇదే కావడం విశేషం. ఆదివారం సాయంత్రం నుంచి మొదలై అర్ధరాత్రి వేళకి నడినెత్తిన నిలిచి, సోమవారం తెల్లవారుజామున పడమటి దిక్కున అస్తమించే వరకు ఈ దృశ్యం వీక్షించవచ్చు. నగరాల్లో కాంతి కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా భవనాలపై నుంచి ఈ ఖగోళ వింతను మరింత స్పష్టంగా ఆస్వాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3D టెక్నాలజీతో పేదల ఇళ్లు.. ఏపీలో 3 లక్షల గృహాలకు శంకుస్థాపన!

మొబైల్ రీఛార్జ్‌తో రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10వేల సైబర్ ప్రొటెక్షన్..

ఒకే ఒక్క సిగరెట్‌.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్‌!

Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్‌ అవుతున్న ప్రత్యేక వంటకం