Reading Time: < 1 minute

ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య.. రాహుల్ అరెస్టును ఖండించిన సీఎం రేవంత్

Caption of Image.

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాల అరెస్టును సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఓట్ల తొలగింపుకు బాధ్యతగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తూ అరెస్టైన రాహుల్ గాంధీనికి కలిసేందుకు 2026 అక్టోబర్ 7న ఢిల్లీ వెళ్లిన రేవంత్.. ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య అని అన్నారు. 

రాహుల్ అరెస్టుకు నిరసనగా బరఖంబా పీఎస్ ను ఇండియా కూటమి ఎంపీలు చుట్టముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ ను కలిసేందకు బరఖంబా పీఎస్ దగ్గరకు వెళ్లిన సీఎం రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఈసీ  ప్రజల ఓటు హక్కును హరిస్తోందని అన్నారు..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రియాంకపై జరిగిన దాడి చూస్తుంటే మోదీ, అమిత్ షా లోని అసహనం కనిపిస్తుందని అన్నారు. 
 
సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను వాడుకుంటూ మోదీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు సీఎం రేవంత్.  సీఈసీ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లపై కుట్ర పన్నారని ఆరోపించారు. సర్ ను నిలిపివేసి తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని డిమాండ్ చేశారు. 

సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు బీజేపీని క్షమించరని అన్నారు. సీఈసీ తో రాజీనామా చేయించండి.. లేదంటే మీరే దిగిపోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరించారు. జ్ఞానేష్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తే మీ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.