Reading Time: 2 minutes

2027 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయ్యే ఐదుగురు స్టార్ క్రికెటర్లు వీళ్లే.. విరాట్, రోహిత్ కూడా!

Caption of Image.

2027 ODI World Cup: దక్షిణాఫ్రికా వేదికగా 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ (2027 ODI World Cup) అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక శకానికి ముగింపు పలికే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ తర్వాత ప్రపంచ క్రికెట్‌‌లోని ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు తమ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పే సూచనలు చానా ఎక్కువగా కానోస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఐదుగురు దిగ్గజాలు ఈ టోర్నమెంట్‌తో తమ ప్రయాణాన్ని ముగించే ఛాన్స్ ఉంది. ఆ లెజెండరీ ఆటగాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ: 

అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి 39 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే T20లు, టెస్టుల నుంచి రిటైరైన కోహ్లీ.. ఈ 50 ఓవర్ల వరల్డ్ కప్‌తో తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికే ఛాన్స్ ఉంది. 

* 317 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 58.78 సగటుతో 15,109 పరుగులు సాధించాడు. ఇందులో 55 సెంచరీలు, 79 అర్ధశతకాలు ఉన్నాయి.

* 2023 వన్డే వరల్డ్ కప్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 95.62 సగటుతో 765 రన్స్ చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ.. మరోసారి భారత్‌కు వరల్డ్ కప్ అందించాలని భావిస్తున్నాడు.

రోహిత్ శర్మ: 

భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2027 నాటికి 40 ఏళ్లకు చేరుకోనున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా నిలిచిన హిట్ మ్యాన్.. 291 వన్డేల్లో 12,120 పరుగులు చేశాడు.

* వన్డే ప్రపంచకప్‌లలో అత్యధికంగా 7 సెంచరీలు కొట్టిన రికార్డు రోహిత్ పేరు మీద ఉంది. 2019 టోర్నీలో ఏకంగా 5 సెంచరీలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

* యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్ళు ఎదుగుతున్న తరుణంలో, 2027 టోర్నమెంట్ రోహిత్‌‌కు చివరి వరల్డ్ కప్ క్యాంపెయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మిచెల్ స్టార్క్: 

* ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మిచెల్ స్టార్క్ వయసు 2027 నాటికి 37 ఏళ్లు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం ఇప్పటికే T20లకు దూరమైన స్టార్క్.. టెస్టులు, వన్డేలపైనే దృష్టి పెట్టాడు.

* 132 వన్డేల్లో 247 వికెట్లు తీసిన స్టార్క్.. వరల్డ్ కప్ చరిత్రలో 65 వికెట్లతో మూడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

* గ్లెన్ మెక్‌‌గ్రాత్ ఆల్-టైమ్ రికార్డు (71 వికెట్లు) నుంచి కేవలం 7 వికెట్ల దూరంలో ఉన్న స్టార్క్.. 2027 టోర్నమెంట్‌తో తన అద్భుతమైన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించవచ్చు.

జోస్ బట్లర్: 

* ఇంగ్లాండ్ వైట్-బాల్ క్రికెట్‌లో కీలక ఆటగాడైన జోస్ బట్లర్ 2027 నాటికి 37 ఏళ్లకు చేరుకోనున్నారు.

* 204 వన్డేల్లో 5,678 రన్స్ చేసిన బట్లర్, 2019 ఇంగ్లాండ్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

* వికెట్ కీపింగ్‌లోని శారీరక శ్రమ, ఇంగ్లాండ్ జట్టులో వస్తున్న మార్పుల కారణంగా, 2027 వరల్డ్ కప్ ఆయనకు చివరి మెగా టోర్నీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

డేవిడ్ మిల్లర్: 

* ‘కిల్లర్ ది మిల్లర్’గా పేరుగాంచిన సౌతాఫ్రికా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ వయసు 2027 నాటికి 38 ఏళ్లు.

* 180 వన్డేల్లో 4,762 పరుగులు చేసిన మిల్లర్, 2023 వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ సాధించాడు.

* సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుని గ్లోబల్ టీ20 లీగ్‌‌లపై దృష్టి పెట్టిన మిల్లర్.. సొంతగడ్డపై జరగనున్న 2027 వరల్డ్ కప్‌‌తో ప్రొటీస్‌కు తొలి ట్రోఫీని అందించి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు.

 
 

©️ VIL Media Pvt Ltd.