Reading Time: < 1 minute
Victory Venkatesh Trivikram Aadarsha Kutumbam Postponed Again October 30is The New Release Date
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకీ ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి తగ్గట్లే ప్రమోషన్లు కూడా ప్లాన్ చేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ మరియు ఆడియా వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే దర్శకుడు త్రివిక్రమ్ మరియు నిర్మాణ సంస్థ కొద్దిరోజులు సమయం తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఈ నెల 30న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెలాఖరులో విడుదల చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ హడావుడి లేకుండా పూర్తవుతాయని, పైగా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ కూడా లభిస్తుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వాయిదా వార్తలపై మరియు కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.