Reading Time: < 1 minute

20 ఏళ్ల వయసు నుంచి ట్యాక్సులు కడుతూనే ఉన్నా: ఐటీ రైడ్స్పై రకుల్ ఎమోషనల్

Caption of Image.

సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు వారం రోజుల తర్వాత ఆదాయప పన్ను శాఖ సోదాలపై స్పందించింది. ఆ సోదాలకు తనతో ఏ విధంగానూ సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఆ సోదాలు తనకు సంబంధించినవి కావని, తాను సాయుధ దళాల నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని, ఈ పరిశ్రమలో తనకు ఎటువంటి గాడ్‌ఫాదర్ లేరని రకుల్ చెప్పింది. 

తాను కేవలం కఠోర శ్రమతోనే పైకి వచ్చానని గుర్తుచేసింది. ఒక బాధ్యతాయుతమైన, చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా 20 ఏళ్ల వయస్సు నుంచే పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తాను వ్యక్తిగతంగా గానీ, ఏదైనా ప్రొడక్షన్ హౌస్ తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ చెల్లింపులలో పాలుపంచుకోలేదని తెలిపింది.

దేశంలో గానీ, విదేశాల్లో గానీ ఎవరి తరఫున కూడా తాను ఎలాంటి బినామీ ఆస్తిని కలిగి లేనని కూడా రకుల్ స్పష్టం చేసింది. ఎవరూ తనకు ఎప్పుడూ ఎలాంటి ఆస్తిని బహుమతిగా ఇవ్వలేదని, అలాగే సూత్రప్రాయంగా తాను అలాంటి ఖరీదైన బహుమతులను స్వీకరించనని రకుల్ తన నోట్లో కుండబద్ధలు కొట్టింది. వాస్తవాలను సరిచూసుకోనందుకు మీడియా నివేదికలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపింది.

►ALSO READ | మేడిపల్లి క్యారెట్ లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ..! అర్థరాత్రి చొరబడి నగలు ఎత్తుకెళ్లారు..!

ఈ తప్పుడు, దురుద్దేశపూరిత, ఊహాజనిత నివేదికలను ప్రచురించిన వారందరూ వాటిని ఉపసంహరించుకుని, వాస్తవాలను స్పష్టం చేయాలని తాను కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎంత పెద్ద మీడియా వ్యాపారాన్ని నడుపుతున్నా, ప్రతి ఒక్కరికీ వారి సొంత వాణిజ్యపరమైన ఒత్తిడులు ఉంటాయని తాను అర్థం చేసుకోగలనని, కానీ అది వాస్తవాలను పణంగా పెట్టే వ్యాపారంగా మారకూడదని రకుల్ హితవు పలికింది. మరీ ముఖ్యంగా.. ఒకరి పరువుప్రతిష్టలను దెబ్బ తీసే విధంగా, జీవనోపాధికి నష్టం కలిగించేలా విధంగా మీడియా కథనాలు, వార్తలు ఉండకూడదని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది.

©️ VIL Media Pvt Ltd.