Reading Time: < 1 minute
Chandrababu Delhi Visit Pm Modi Meeting Polavaram Funds On Agenda

CM Chandrababu Delhi Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాటకు సిద్ధమయ్యారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవున్నట్టుగా తెలుస్తోంది.. రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి రూ.33 వేల కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ నిర్మాణానికి అవసరమైన రూ.2,300 కోట్ల నిధులను కేంద్రం నుంచి కేటాయించాలని కూడా చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుసంధాన మౌలిక వసతులకు సంబంధించిన నిధులపై కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది..