
ఎఫ్ఐఆర్ లు తనకు మెడల్స్ తో సమానమని అన్నారు రాహుల్ గాంధీ. ఎన్ని ఎఫ్ఐఆర్ లు పెట్టినా భయపడేది లేదన్నారు. ఇప్పటికే 45 నమోదయ్యాయని.. తన టార్గెట్ వంద అని అన్నారు. 2026 అక్టోబర్ 7న ఢిల్లీలోని సాగర్ రత్న హోటల్ కూటమి నేతల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఇక నుంచి జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేయనున్నట్లు చెప్పారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమ ఎన్నికల కమిషనర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఎన్నికల కమిషనర్ తో మాట్లాడేందుకు వెళ్తున్నామని.. ఈసీ ముందు ధర్నా చేసేందుకు కాదని తెలిపారు. సీఈసీ తో భేటీ అవ్వడానికి పోలీసులు అడ్డుపడుతుండటంతో.. తమ నిరసన ఇక జంతర్ మంతర్ దగ్గర ఉంటుందన్నారు.
ఇండియా కూటమి డిమాండ్లు నెరవేరే వరకు తమ నిరసన ఆగదని ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఏకమైనట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కేసులైనా పెట్టని.. డిమాండ్లు నెరవేరే వరకు వెనకకు తగ్గేది లేదన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
అంతకు ఇండియా కూటమి నేతలు సాగర్ రత్న హోటల్ లో భేటీ అయ్యారు. కూటమి నేతలతో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
►ALSO READ | ఢిల్లీలో హైటెన్షన్.. ఈసీ కార్యాలయానికి కూటమి మార్చ్
లంచ్ మీటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కూటమి నేతలు. హోటల్ దగ్గర మూడు బస్సులు ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రసిడెండ్ ద్రౌపది ముర్మును కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హోటల్ దగ్గర మూడు బస్సులు ఏర్పాటు చేశారు.
ఈసీ కార్యాలయం వైపు వెళ్తున్న సాగర్ రత్న హోటల్ దగ్గర పోలీసులు, కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. మూడు బస్సుల్లో ఈసీ కార్యాలయానికి వెళ్తున్న కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు ప్రధాని రాజీనామా చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ రాజీనామా వరకు పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.