Reading Time: < 1 minute
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు

ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులు పెట్టుబడిదారులను, వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. అంతకుముందు ఆల్ టైం రికార్డు స్థాయిలను నమోదు చేసిన గోల్డ్ ధరలు వేగంగా పతనమయ్యాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం బంగారం సురక్షిత పెట్టుబడి సాధనం తన ఆకర్షణను కోల్పోతోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతూ కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించాయి. తాజా నివేదికల ప్రకారం, అక్టోబర్ 5న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,180 పలుకుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,750 వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,45,000తో కొనసాగుతోంది. ఇటీవలి ధరలను పరిశీలిస్తే, అక్టోబర్ 3న ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,330 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,900 వద్ద ట్రేడ్ అయింది. ముంబై, చెన్నై, కోల్ కత్తాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,49,180 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,750 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కొనుగోలుదారులు బంగారం కొనడానికి వెళ్లే ముందు ధరలను మరోసారి సరిచూసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

100 కోట్ల హిట్టు కొట్టిన హీరో.. కనిపించడం లేదేంటి?

నీకు ప్రాణ హాని ఉందని చెబితే.. సల్మాన్ లైట్ తీసుకున్నాడు

Venu Swamy: నేను సన్నీ లియోన్ లాంటోడిని..

లైన్ క్రాస్ చేసిన కార్తీ…తమిళ థియేటర్‌ ఓనర్లు సీరియస్

ఆడదని ముందే తెలుసు…పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు