Reading Time: 2 minutes

Success Story: రెండు కిరాయి ఆవులతో మొదలైన డైరీ ఫాం.. ఏటా రూ.రెండున్నర కోట్ల సంపాదన!

Caption of Image.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న పరిస్థితుల్లో..  ఎలాంటి టెక్నాలజీ వచ్చినా  డోంట్ కేర్ అన్నట్లుగా..  జాబులు వదిలి సరికొత్త ఆర్థిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.. తమకు తామే బాస్ అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు యువతీ యువకులు. అలాంటి వారే జైపూర్ కు చెందిన ఈ కపుల్ విభోర్ జైన్, ఇషిత జైన్. కిరాయి ఆవులతో ఏర్పాటు చేసిన డైరీ ఫామ్.. ఇప్పుడు ఏడాదికి రెండున్న కోట్ల టర్నోవర్ ఇచ్చే స్థాయికి తీసుకువచ్చిన వీళ్ల సక్సెస్ స్టోరీ ఎందరికో ఆదర్శం.

విభోర్, ఇషిత 2018లో కొన్ని గిర్ సంతతికి చెందిన ఆవులతో చిన్న డైరీ ఫామ్ ప్రారంభించారు. అప్పడు పెద్దగా భూమి లేదు.. అగ్రికల్చర్ బిజినెస్ లో అనుభవం లేదు. కేవలం అద్దెకు తీసుకున్న ఆవులతో ఫాం ప్రారంభించారు. జైపూర్ నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్న కినయా ఆర్గానిక్ ఫామ్స్ అండ్ లైఫ్.. ఇప్పుడు 100 ఆవులతో.. ఏడాదికి 2 కోట్ల 40 లక్షల టర్నోవర్ వస్తుండటం విశేషం.   పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 

పాలు, పాల ఉత్పత్తులే కాకుండా  ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారీ, మిగిలిన వ్యర్థాలతో ఆర్గానికి ఎరువులక తయారు చేస్తున్నారు. అంతే కాకుండా 45 కిలో వాట్ల సోలార్ సెటప్, వర్షపు నీటితో సాగు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం ఈ ఫామ్ స్పెషల్.

బీటెక్ నుంచి డైరీ ఫామ్ వైపు:

విబోర్ బెంగళూరు నుంచి  కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అందరిలా కార్పోరేట్ ప్రపంచంవైపు వెళ్లకుండా.. తన కొత్తగా ఆలోచించాడు. తన కుటుంబం రెండు ఆవులను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, అతనికి గిర్ ఆవుల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత అతను 2017లో గుజరాత్‌లోని కతియవార్‌కు వెళ్లి, తరతరాలుగా ఆవులను పెంచుతున్న కుటుంబాల నుండి పశుపోషణ పద్ధతులను నేర్చుకున్నాడు.  

విబోర్‌కు మొదట్లో వ్యవసాయం లేదా అమ్మకాల గురించి పెద్దగా అవగాహన లేదు, కానీ అతని ఇంట్లోని రెండు ఆవులు అతనికి ఆవులు, ఆవు పేడ,  సాంప్రదాయ పశుపోషణపై ఆసక్తిని కలిగించాయి. పాడి పరిశ్రమను ప్రారంభించడానికి ముందు అతను స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. 2018లో, అతను జైపూర్ సమీపంలో భూమిని కౌలుకు తీసుకుని 20 గిర్ ఆవులతో ప్రారంభించాడు. ఈ కపుల్ పెద్ద వ్యవసాయ నమూనా వైపు వెళ్లడానికి ముందు, మొదటి మూడు సంవత్సరాలు పాడి పరిశ్రమ కార్యకలాపాలను నేర్చుకోవడాని ప్రాధాన్యతనిచ్చారు. 

►ALSO READ | Best Honey: షాపుల్లో ఎలాంటి తేనే బాటిల్స్ కొనాలి.. పరిశీలించాల్సిన వివరాలు ఇవే..!

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ, హెచ్‌ఆర్‌లో ఎంబీఏ చేసిన ఇషిత, 2022లో వివాహం తర్వాత విబోర్ ప్రారంభించిన ఫామ్ కు సంబంధించిన  కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 

ఈ కపుల్ ప్రారంభించిన పాడి పరిశ్రమ ఇప్పుడు 100 గిర్ ఆవుల వరకు విస్తరించింది. ఈ ఫాం రోజుకు సుమారు 250-300 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది, అందులో కొన్ని పాలను అమ్మగా..  మిగిలిన పాలను సాంప్రదాయ బిలోనా నెయ్యి తయారీకి ఉపయోగిస్తారు. ప్రతిరోజూ సుమారు తొమ్మిది లీటర్ల నెయ్యి ఉత్పత్తి అవుతుంది. 

అయితే వీరి  వ్యాపారం పాలు, నెయ్యికి మించి  విస్తరించింది. ఈ ఫారం కట్టెల నూనెలు, సేంద్రీయ కూరగాయలు, కొలోస్ట్రమ్ పౌడర్‌తో సహా ఫ్రీజ్-డ్రైడ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. వీళ్లు 100 ఆవుల పాల నుండి నెయ్యితో సహా 25 కంటే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేస్తుంది.

  పశువుల అమ్మకాలను మినహాయించి, ఈ ఫామ్  నెలవారీ ఆదాయం ప్రస్తుతం సుమారు రూ. 18 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఉంది. దీని ప్రకారం ఏడాదికి ఆదాయం రూ. 2.16 కోట్ల నుంచి రూ. 2.4 కోట్ల మధ్య ఉంటుంది.

కినాయ ఫామ్ లో  కార్యకలాపాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆవులు పాలు, పేడను అందిస్తాయి. పేడ బయోగ్యాస్ వ్యవస్థలోకి వెళుతుంది. దాని నుండి వచ్చే పదార్థం ఎరువుగా నేలకు తిరిగి చేరుతుంది. చెట్లు పండ్లను అందిస్తాయి.  వర్షపు నీటిని సేకరించి నిల్వ చేస్తారు. సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అదే సమయంలో పంటలు, పశువులకు మేత కూడా అదే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలో పండిస్తారు.

  విభోర్, ఇషితాల చిన్న ఆలోచన.. రెండు ఆవులతో మొదలైన ఒక చిన్న ఆసక్తి, ఇప్పుడు 2,000కు పైగా చెట్లు, రెనువబుల్ ఎనర్జీ,  వర్షపు నీటి సేకరణ,  అనేక రకాల ఉత్పత్తులతో కూడిన 100 ఆవుల వ్యవసాయ క్షేత్రంగా మారింది. వీళ్ల స్టోరీ ఎందరికో ఇన్స్పిరేషన్ గా  మారింది. 

©️ VIL Media Pvt Ltd.