Reading Time: < 1 minute

జగిత్యాల: కేంద్రానివి ప్రజా వ్యతిరేక విధానాలు ..ఓటు బచావో.. – దేశ్ బచావో అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం

Caption of Image.

 

  •    మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఓటు హక్కును కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా హరిస్తుందో ప్రజలకు వివరిస్తూ  ప్రజా వ్యతిరేక విధానాలను బట్టబయలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అధ్యక్షతన నిర్వహించిన ఇండియా కూటమి, మిత్రపక్షాల ఆధ్వర్యంలో ‘ఓటు బచావో.. – దేశ్ బచావో’  అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరిని, ఓటు చోరీ అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలపై ఉందన్నారు.

©️ VIL Media Pvt Ltd.