
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. దీని కేంద్రం ఖదూన్ లగా గ్వాలీకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ ప్రాంతంలో కూడా 4.4 తీవ్రతతో మరో ప్రకంపన నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని జిల్లాలతో పాటు పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
యూపీలో భూ ప్రకంపనలు
మరోవైపు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నోయిడా, మీరట్ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, ఎత్తైన హౌసింగ్ సొసైటీలలో ఫ్యాన్లు, లైట్లు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో సంభవించిన భారీ భూకంప ప్రభావం కూడా ఉత్తర భారతదేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలపై కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం భౌగోళికంగా భూకంపాలు సంభవించే అధిక ముప్పు ఉన్న ప్రాంతాల జాబితాలోకి వస్తుంది. శాస్త్రీయ వర్గీకరణ ప్రకారం ఢిల్లీ ప్రాంతాన్ని అత్యంత సున్నితమైన సీస్మిక్ జోన్-4 పరిధిలో చేర్చారు. హిమాలయ పర్వత శ్రేణులకు సమీపంలో ఉండటం, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతరం ఫలకాల కదలికలు జరుగుతుండటం వల్ల ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుంటాయి.
భూమి లోపలి పొరల్లో ఉండే ఏడు ప్రధాన టెక్టోనిక్ ఫలకాలు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇవి కలిసే ప్రదేశాలను ఫాల్ట్ లైన్లు అంటారు. ఈ ఫలకాలు తీవ్రమైన ఒత్తిడికి గురై వంగిపోవడం లేదా విరిగిపోవడం జరిగినప్పుడు, భూగర్భం నుంచి అపారమైన శక్తి తరంగాల రూపంలో పైకి దూసుకువస్తుంది. ఈ శక్తినే మనం భూకంప ప్రకంపనలుగా అనుభవిస్తాం.
EQ of M: 4.9, On: 06/10/2026 22:23:13 IST, Lat: 30.103 N, Long: 79.561 E, Depth: 13 Km, Location: Chamoli, Uttarakhand.
For more information Download the BhooKamp App
https://t.co/5gCOtjdtw0
@DrJitendraSingh
@OfficeOfDrJS
@tummalasrini
@GSuresh_NCS
@ndmaindia https://t.co/58BGGnvY1V— National Center for Seismology (@NCS_Earthquake) October 6, 2026