Reading Time: < 1 minute

ఢిల్లీలో పరిస్థితి అల్లకల్లోలం.. రాహుల్ గాంధీని అడ్డుకున్న పోలీసులు.. రోడ్డు పైనే ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్ర నేత

Caption of Image.

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వివాదాస్పద ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ.. ఆయనను సీఈసీ పోస్ట్ నుంచి తొలగించాలని విపక్షాల ఢిల్లీలో ‘సేవ్ డెమొక్రసీ’ ర్యాలీ నిర్వహించాయి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి విపక్ష ఎంపీలు నిరసనగా వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీ ఆకాశ వాణి భవన్ దగ్గరకు చేరుకోగానే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. జ్ఞానేష్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని రాహుల్, విపక్ష నేతలు నినాదాలు చేశారు.

ALSO READ : ఢిల్లీలో హై టెన్షన్.. ఈసీ కార్యాలయం దగ్గర హై సెక్యూరిటీ

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో.. కేవలం 200 మీటర్ల దూరంలో నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా నిరసనలో పాలు పంచుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా నిరసన జరుగుతున్న దగ్గరకు వెళ్లి విపక్షాల నిరసనకు మద్దతు తెలిపారు. ఇండియా కూటమి నేతలంతా ‘ఓట్ చోర్’ అని నినదించారు.

©️ VIL Media Pvt Ltd.