
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సన్స్ టెస్ట్ (సీజీఈపీటీ) 01/2027, 02/2027 బ్యాచ్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా ఎన్‌రోల్డ్ పర్సన్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభమైంది. అక్టోబర్ 21 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టులు: నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్, హైజీనిస్ట్–I.
పోస్టు పేరు: నావిక్ (జనరల్ డ్యూటీ)
ఖాళీలు: 130 (పురుషులు 117, మహిళలు 13).
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2005, నవంబర్ 1 నుంచి 2009, మే 1 మధ్యలో జన్మించి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పోస్టు పేరు: నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్).
ఖాళీలు: 25.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2005, నవంబర్ 1 నుంచి 2009, అక్టోబర్ 1 మధ్యలో జన్మించి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పోస్టు పేరు: హైజీనిస్ట్–I.
ఖాళీలు: 20.
విద్యార్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి మెట్రిక్సులేషన్ లేదా ఐటీఐ లేదా సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2005, నవంబర్ 1 నుంచి 2009, అక్టోబర్ 1 మధ్యలో జన్మించి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
పోస్టు పేరు: యాంత్రిక్
ఖాళీలు: 60.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదం పొందిన 3 లేదా 4 సంవత్సరాల కాలపరిమితి గల డిప్లొమా (ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ – రేడియో/ పవర్ ఇంజినీరింగ్) పూర్తిచేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి,12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, ఏఐసీటీఈ ఆమోదించిన 2 లేదా 3 సంవత్సరాల కాలపరిమితి గల డిప్లొమా (ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ – రేడియో/పవర్ ఇంజినీరింగ్) కలిగి ఉండాలి. యాంత్రిక్ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.
వయసు: 2005, మే 1 నుంచి 2009, మే 1 మధ్యలో జన్మించి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 6.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు ఫీజు ఉండదు. ఇతరులు రూ. 550 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 21.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ (పీఎస్టీ), అసెస్మెంట్, అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ssc.gov.inను సందర్శించండి.
కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష
కోస్ట్ గార్డ్ నియామక ప్రక్రియలో భాగంగా మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (సీబీఈ) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) హిందీ, ఇంగ్లిష్ లో ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. తప్పు సమాధానాలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.