Reading Time: < 1 minute
Houthi Attacks Saudi Arabia Despite Pakistan Entry Ballistic Missiles Target Airports

Saudi-Houthi War: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ‘‘మక్కా ఒప్పందం’’ అమలులోకి వచ్చినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్-టర్కీ దేశాలు తమ సైన్యాన్ని సౌదీకి రక్షణగా నిలపడం ప్రారంభించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు.

ఇదిలా ఉంటే, ఈ పరిణామం చోటుచేసుకున్న తర్వాత కూడా హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు తగ్గించలేదు. మరోసారి డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. సోమవారం నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాలపై దాడులు జరిగాయని, రెండు విమానాశ్రయలు దెబ్బతిన్నాయని, ముగ్గురు గాయపడ్డారని సౌదీ అరేబియా మంగళవారం చెప్పింది. సౌదీ చమురు సంస్థలు, విమానాశ్రయాలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

సౌదీ అరేబియాకు పాకిస్తాన్, టర్కీలు అండగా నిలిచినా తగ్గేది లేదని హౌతీలు వరస దాడులతో స్పష్టం చేస్తున్నారు. యెమెన్‌ నుంచే డ్రోన్, క్షిపణి దాడులు చేయగల సామర్థ్యం హౌతీల వద్ద ఉంది. ప్రత్యేక కమాండ్ వ్యవస్థ ఉండటమే దీనికి కారణం. సౌదీ భద్రతలో పాకిస్తాన్ పాత్ర పెరిగినంత మాత్రాన దాని సైన్యం యెమెన్‌లో హౌతీలతో నేరుగా తలపడే అవకాశాలు తక్కువే. దీంతో పాకిస్తాన్ సౌదీ రక్షణ విషయంలో అండగా నిలుస్తున్నప్పటికీ హౌతీలు తమ దాడుల్ని తగ్గించడం లేదు.