Reading Time: < 1 minute

తిరుమలలో సర్వ దర్శనానికి 10 గంటల సమయం

Caption of Image.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. సోమవారం ఉదయం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతుండటం గమనార్హం. ఆదివారం ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 90 వేల 292 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 329 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

హుండీ ఆదాయం రూ. 4.61 కోట్లు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, తాగునీరు, పాలు అందిస్తోంది. రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది.

మరోవైపు భారీ రద్దీ నేపథ్యంలో దర్శనాల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 5న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వచ్చే యాత్రికులు టీటీడీ సూచనలు, దర్శన సమయాలను ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.