బ్రోకలీ: బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సల్ఫోరాఫేన్ వంటివి ఈ మొక్కల సమ్మేళనాలు, విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి, మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మీ ఆహారంలో తీసుకోవచ్చు. అయితే, మీరు ఈ బ్రోకలీని ఒక పెద్ద గిన్నెలో ఉడికించి ఉప్పు కారం వేసి తింటే మంచిగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది.
బెర్రీ పండ్లు: పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా ఈ బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ మంచిగా ఉంటాయి. అలాగే, ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారంలో మంచి ఎంపికగా ఉంటాయి.
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్స్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని పొడి చేసుకుని పెరుగు, ఇంకా ఒక కప్పు ఓట్స్ ఇంకా మీరు ఇతర ఆహారాల్లో కవీటిని కలిపి తీసుకోవచ్చు. వీటిని మితంగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.
ఆకుకూరలు: మీరు తినే ఆహారాల్లో పాలకూర, తోటకూర, మెంతికూర వంటి వాటిని తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఫైబర్, ఫోలేట్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇంకా మీ రోజువారీ భోజనంలో ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మొత్తం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
వాల్నట్స్: వాల్నట్స్ లో మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా ఒమేగా-3, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇంకా మీరు రోజూ వీటిని మితంగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అస్సలు రాదు. ఇంకా ఈ వాల్నట్స్ను తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.




