
తిరుపతి: తిరుమల శ్రీవారిని భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న ఆయన.. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
దర్శనం అనంతరం ఆలయ అర్చకులు శిఖర్ ధావన్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శిఖర్ ధావన్ తెలిపారు. తన పర్యటనకు ఏర్పాట్లు చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలన విభాగానికి ధావన్ కృతజ్ఞతలు కూడా తెలిపారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శిఖర్ ధావన్‌ను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు, భక్తులు పోటీ పడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.
వీడియో చూడండి..