Reading Time: 2 minutes
మొబైల్ రీఛార్జ్‌తో రూ.లక్ష ప్రమాద బీమా.. రూ.10వేల సైబర్ ప్రొటెక్షన్..

ఇటీవల కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా లు రీఛార్జ్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (బిఎస్ఎన్ఎల్) మాత్రం కస్టమర్ల కోసం మాస్టర్ ప్లాన్ వేసింది! సాధారణంగా మనం మొబైల్ రీచార్జ్ చేసుకుంటే కేవలం కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి సర్వీసులు మాత్రమే వస్తాయని అనుకుంటాం.. కానీ ఇది అంతకు మించి అన్నమాట.. కేవలం ఇంటర్నెట్ డేటా, కాలింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు BSNL రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా రూ. 1 లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా, అలాగే 10వేలు సైబర్ మోసాల కవరేజ్ లభించబోతున్నాయి.. అదీ రూపాయి కూడా అదనపు ప్రీమియం చెల్లించాల్సిన పనిలేకుండా.. అసలు ఈ ఆఫర్ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్‌లు ఏంటి? పాలసీ ఎలా యాక్టివేట్ అవుతుంది? ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం! “BSNL తన వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ క్రేజీ ఆఫర్‌ను ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ (OICL) భాగస్వామ్యంతో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ రెండు ప్లాన్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది: STV 202 ప్లాన్:300 నిమిషాల వాయిస్ కాల్స్, 5GB హై-స్పీడ్ డేటా,100 SMSలు లభిస్తాయి. STV 2449 ప్లాన్.. ఇది ఇయర్లీ ఆఫర్ ఏకంగా 365 రోజులపాటు.. అంటే.. ఒక సంవత్సరం వ్యాలిడిటీ. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు. ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ వద్దనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్! “సరే! అసలు ఈ ప్లాన్‌లతో ఎలాంటి అదనపు సెక్యూరిటీ వస్తుందో ఒకసారి గమనిస్తే 1 లక్ష ఉచిత ప్రమాద బీమా.. రీఛార్జ్ చేసుకున్న చందాదారుడికి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ. 1 లక్ష వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది. 10వేల రూపాయల సైబర్ సెక్యూరిటీ కవరేజ్.. ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీరు ఆన్‌లైన్ సైబర్ మోసానికి గురైతే… అర్హత కలిగిన నష్టాలకు రూ. 10,000 వరకు కవరేజీని బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుంది. “ఇంక ఈ ఇన్సూరెన్స్ కోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లి ఫారమ్‌లు నింపక్కర్లేదు లేదా కొనుగోలు చేయక్కర్లేదు!మీరు ఈ ప్లాన్‌లలో రీఛార్జ్ చేసుకున్న 24 గంటల తర్వాత బీమా కవరేజ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. పాలసీ వివరాలు నేరుగా మీ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా వచ్చేస్తాయి! ఈ రోజుల్లో రీఛార్జ్ రేట్లు పెంచడమే తప్ప కస్టమర్ల భద్రత గురించి పట్టించుకోని ప్రైవేట్ దిగ్గజాలకు BSNL గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో కనెక్టివిటీతో పాటు డిజిటల్ భద్రతను ఇవ్వడం నిజంగా ప్రశంసనీయమే.. అయితే, ఈ కవరేజ్ ‘ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ’ నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని పేర్కొంటున్నారు. “సో ఫ్రెండ్స్… BSNL తెచ్చిన ఈ ఉచిత ఇన్సూరెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆఫర్‌పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి! మీ ఇంట్లో BSNL వాడుతున్న వారు ఉంటే లేదా కొత్త సిమ్ తీసుకోవాలనుకునే ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే ఒక్క సిగరెట్‌.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్‌!

Putin: అక్కడ గనక దాడి చేస్తే అణు బాంబులేస్తాం.. పుతిన్‌ వార్నింగ్‌

దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్‌ అవుతున్న ప్రత్యేక వంటకం

గుడ్‌ న్యూస్‌.. ఇక పురుషులకూ ఫ్రీ బస్‌ సదుపాయం

ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..