Reading Time: < 1 minute

తెలంగాణ ఉద్యమంలో కాకా బుల్లెట్ దెబ్బలు తిన్నారు: ఎంపీ వంశీకృష్ణ

Caption of Image.

కాకా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అధికారికంగా కాకా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నేతలు, కాకా అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. తెలంగాణ ఏర్పాటు కోసం కాకా గట్టిగా పోరాడారని.. ఉద్యమంలో బుల్లెట్ దెబ్బలు తిన్నారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.

పార్టీలకతీతంగా కాకాకు అభిమానులు ఉండటం ఎంతో సంతోషమని అన్నారు. తెలంగాణ వచ్చేవరకు బతికే ఉంటానని కాకా అనేవారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు దోపిడీ జరిగిందని అన్నారు. 

సింగరేణి కార్మికులకు పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందని..RCFL కు కాకా కేంద్రం నుంచి రూ. 10 వేల కోట్లు ఇప్పించారని అన్నారు. తెలంగాణ రైతులకు రామగుండము యూరియా అందాలని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.
 

©️ VIL Media Pvt Ltd.