Reading Time: < 1 minute

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 67 రోజుల తర్వాత జైలు నుంచి రిలీజ్

Caption of Image.

హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ఆయనకు ఉప్పరపల్లి కోర్టు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది.  ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని  ఆదేశించింది. దీంతో 67 రోజులుగా జైల్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి విడుదలయ్యారు.

ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనతో కలిసి పనిచేస్తున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారి గతంలో అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ALSO READ : విశాఖ నేవీ సిబ్బందిని టార్గెట్ చేసిన పాక్ టెర్రరిస్టులు

తాజాగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుమారు 67 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

 

©️ VIL Media Pvt Ltd.