Reading Time: < 1 minute

20 మంది సెలబ్రిటీలు.. ఒకే చోట తీవ్రమైన మైండ్ గేమ్.. ఉత్కంఠ రేపుతున్న ‘ది ట్రైటర్స్’ ట్రైలర్!

Caption of Image.

డిజిటల్ ఓటీటీ ప్రపంచంలో మరో క్రేజీ మైండ్ గేమ్ షో సందడికి సిద్ధమైంది.  గ్లోబల్ హిట్ ఫార్మాట్ ఆధారంగా గ్రాండ్‌గా తెరకెక్కించిన ‘ది ట్రైటర్స్ తెలుగు’ (The Traitors Telugu) ట్రైలర్ ను  అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.  రియాలిటీ షోతో హోస్ట్‌గా ‘హనుమాన్ ‘ మూవీతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా తొలిసారిగా చేస్తున్నారు. ఇది మొత్తం 10 ఎపిసోడ్స్ గా ప్రసారం కానుంది.

ఈ షో కాన్సెప్ట్ అంతా.. విశ్వాసం – నమ్మకద్రోహం (Trust & Betrayal) అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. నమ్మకమే ఇక్కడ అతిపెద్ద బలహీనత. 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌ను ఒకే చోట చేర్చి, వారిలో కొందరిని రహస్యంగా ‘ట్రైటర్స్’ గా, మిగిలిన వారిని ‘ఇన్నోసెంట్స్’గా విడదీస్తారు. ఇన్నోసెంట్స్ ముసుగులో ఉన్న ట్రైటర్స్‌ను కనిపెట్టాలి.. ట్రైటర్స్ తమ ఐడెంటిటీ దాచుకుంటూ గేమ్ ఆడాలి.   

చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి, వికటకవి ప్రణవ్, విద్యుల్లేఖా రామన్, వర్షా డిసౌజా, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ వంటి 20 మంది ప్రముఖ సెలబ్రిటీలు ఈ హై-స్టేక్స్ గేమ్‌లో పాల్గొంటున్నారు. ఫ్రెండ్‌షిప్స్, అలయన్సెస్ వెనుక దాగున్న అసలు స్కెచ్‌‌లను బయటపెడుతూ ఈ షో సాగనుంది. సాధారణ గేమ్ షోల మాదిరిగా ఇక్కడ టాస్కులు, పాయింట్లతో పాటు మైండ్ గేమ్, బ్లఫ్, స్ట్రాటజీ, మోసం కీలకంగా మారనున్నాయి.

నమ్మకం ఇక్కడ బలమా? లేక బలహీనతా? స్నేహం ఎప్పుడు వెన్నుపోటుగా మారుతుంది? ఎవరు నిజాయితీపరులు.. ఎవరు అసలు మోసగాళ్లు? అనే ఉత్కంఠతో సాగే ఈ రియాలిటీ షో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

 

©️ VIL Media Pvt Ltd.